Header Banner

మోడీ పర్యటనలో భాగంగా భారీ బందోబస్తు! డ్రోన్లకు నో ఎంట్రీ!

  Thu May 01, 2025 16:00        Politics

డ్రోన్లు, బెలూన్ల ఎగరవేతపై ఏపీ పోలీసులు ఆంక్షలు విధించారు. రేపు ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో అమరావతి పరిధిలో డ్రోన్లు, బెలూన్ల ఎగరవేతపై నిషేధం విధించారు. ఒకవేళ ఎగరవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రధాని మోడీ శుక్రవారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను మోడీ పున: ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సుమారు రూ.58 వేల కోట్ల అమరావతి ప్రాజెక్ట్లకు శంకుస్థాపనం, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఎమ్మెల్యేలు, మంత్రుల గృహ సముదాయాలకు శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా ఆలిండియా సర్వీసెస్ అధికారుల నివాస సముదాయానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు నాగాయలంకలో మిసైల్ టెస్ట్ రేంజ్కు కూడా శంకుస్థాపన చేయనున్నారు.

అలాగే విశాఖలో యూనిటీ మాల్కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం రూ.3,680 కోట్ల నేషనల్ హైవే పనులు ప్రారంభించనున్నారు. కాజీపేట- విజయవాడ 3వ లైన్ ప్రారంభం కానుంది. గుంటూరు–గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా మోడీ ఈ ప్రారంభోత్సవం చేయనున్నారు. ప్రధాని మోడీ శుక్రవారం ఏపీలో గంటా 25 నిమిషాల పాటు పర్యటించనున్నారు. మే 2న మధ్యాహ్నం 3:25కి రానున్నారు. ఇక సభా వేదికపై 14 మంది ఆసీనులు కానున్నారు. తొలుత మంత్రి నారాయణ ప్రసంగించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీచ్ ఇవ్వనున్నారు. చివరిగా ప్రధాని మోడీ ప్రసంగంతో సభ ముగియనుంది. ఇక ప్రధాని పర్యటన సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఇక ప్రధాని

ఇది కూడా చదవండి: రేపు ఏపీకి ప్రధాని మోడీ.. బంగాళాఖాతంలో ఆవర్తనం.. కోస్తాకు పొంచి ఉన్న వానగండం! 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

సభకు రాష్ట్రంలో ఉన్న వివిధ పార్టీల నేతలను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది.





   #andhrapravasi #PMModiVisit #DroneBan #Amaravati #TightSecurity #NoFlyZone #ModiInAP #SecurityAlert #ModiVisit2025